పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ నల్లబెల్లి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు స్టేషన్ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు.