ఆళ్లగడ్డలో విద్యుత్ బిల్లులపై అవగాహన ఆళ్లగడ్డ పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఆటో ప్రచారం నిర్వహించి ప్రజలకు బిల్లులు సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 14 రోజుల్లో చెల్లించని పక్షంలో విద్యుత్ నిలిపివేత జరిమానా తప్పదని హెచ్చరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా బిల్లులు చెల్లించే సౌకర్యం ఉందని వివరించారు.