సరూర్నగర్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో కార్పొరేటర్ శ్రీవాణి పర్యటించారు. డ్రైనేజీలో ఓవర్ ఫ్లో సమస్యతో పాటు శానిటేషన్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.