పలమనేరు: గొల్లపల్లి గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు. ఓ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న దేవాలయం గోడను ఢీకొంది, అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదన్నారు కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. కారు రోడ్డుకు అడ్డంగా ఉండడం వలన వెనుక వచ్చే మరో వాహనాలు ఢీకొంటాయేమోనని ఉద్దేశంతో, గ్రామస్తులందరూ మరో ప్రయత్నం చేయక తమ చేతులతో ఆ కారుని రోడ్డుపై నుండి పక్కకు తీసి పడేశారు.