నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ డ్యాం త్రివర్ణ శోభను సంతరించుకుంది. మువ్వన్నెల కాంతులతో నాగార్జునసాగర్ డ్యాం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్యామును అధికారులు మూడు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్యాంగ్ గేట్ల వద్ద కాషాయం, తెలుపు, ఆకుపచ్చ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ జెండా రంగుల్లో 26 గేట్ల నుండి వస్తున్న నీరు పరవళ్ళు తొక్కుతూ దేశభక్తిని పెంపొందిస్తుందని, ఈ దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయని స్థానికులు గురువారం రాత్రి తెలిపారు.