ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావు శుక్రవారం రాత్రి నుండి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన శనివారంరాత్రి 10 గంటల సమయంలో రాత్రి వెలుగులోకి వచ్చింది జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు సెల్ఫోన్ చివరి సిగ్నల్ తాడ్వాయి ఏజెన్సీ అటవీ ప్రాంతంలో గుర్తించడంతో ప్రత్యేక బృందాలతో డ్రోన్ కెమెరా ద్వారా ఏజెన్సీ అటవీ ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు.