రాజోలు మండలం పాలగుమ్మి రోడ్డులో బుధవారం ఉదయం విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగాయి. వర్షం పడుతుండటంతో వైర్లు తెగిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను సరిచేసి, చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరారు.