ఎంతో విశిష్టత ఉన్న కొల్లేరు సరస్సును చేపల చెరువులుగా మార్చకుండా, సంప్రదాయ వ్యవసాయంతో పర్యావరణాన్ని కాపాడుకోవాలని డీయఫ్‌ఓ హిమ శైలజ పిలుపునిచ్చారు. కొల్లేరు సరస్సు పరిరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలని, ప్రజలు అటవీశాఖకు సహకరించాలని ఆదివారం సాయంత్రం డీయఫ్ఓ హిమ శైలజ కోరారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో 5వ కాంటూర్‌లో చేపల చెరువులు, ఆక్వా కల్చర్ చేయకూడదని స్పష్టం చేశారు.