జిఎస్టి తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా జిఎస్టి స్లాబులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.