హుజురాబాద్: డివిజన్ లోని అన్ని మండలాలకు త్వరలో తగినంత యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించడం జరుగుతుందని హుజురాబాద్ డివిజనల్ అగ్రికల్చర్ అధికారి జి సునీత అన్నారు. ఇప్పటివరకు యూరియా బస్తాలు తీసుకొని రైతులకు మాత్రమే మొదటగా ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం ఇప్పటివరకు ఏ ఏ రైతులు ఎన్ని బస్తాలు కొనుగోలు చేశారని సమాచారాన్ని సేకరించాలని అన్నారు. కావున రైతు సోదరులు విషయాన్ని గమనించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారికి వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలని హుజురాబాద్ డివిజనల్ వ్యవసాయ అధికారిని జి సునీత ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.