జిల్లా లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో 35 లక్షలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని చెప్పారు. విజన్ 2047 తో పనిచేస్తున్నామని, రానున్న 20 సంవత్సరాల కాలంలో నగరంలో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం తో పాటు, నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి