రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, టెక్స్టైల్ పార్కులో కార్మికుల శ్రమకు తగ్గిన వేతన అందించాలని చేపట్టిన సమ్మె 8వ రోజు టెక్స్టైల్ పార్కు గేటు ముందు CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ యాజమాన్లు కార్మికులకు కూలీ పెంపు పై వెంటనే స్పందించి సమ్మె విరమింప చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలను ప్రారంభించే కార్మికులకు ఉపాధి కల్పిస్తామని గత 20 సంవత్సరాల క్రితం అతి తక్కువ ధరలకు ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇప్పటివరకు