పెన్షన్ల తొలగింపుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించిన మంత్రి కొల్లు రవీంద్ర దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్తానిక బందరు మండలం పోతేపల్లిలో శనివారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల తొలగింపుపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వారి పెన్షన్లను రెట్టింపు చేసి పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు.