వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే అర్హత వై.ఎస్. జగన్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసినందుకే గత ఎన్నికల్లో ప్రజలు జగన్ ను 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తాత్కాలికంగా ఒకట్రెండు చోట్ల యూరియా కొరత వస్తే దాన్ని రాద్ధాంతం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.