Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో "మా ఊరి సంత" పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షేడ్లు, మూత్రశాలలను గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విధితమే. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు గణపురం మండల కేంద్రానికి చేరుకొని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం నిర్వహించామని తెలిపారు.