నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చేపట్టిన త్రాగునీటి పనులను ఈ డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం ఆదేశించారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ సమావేశం మందిరంలో మున్సిపల్ పరిధిలోని చేపట్టిన త్రాగునీరు రోడ్లు మురికి కాలువలు పారిశుధ్యం తదితర అంశాలపై మున్సిపల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు .పట్టణంలోని అమృత్ పథకం కింద సుమారు 56 కోట్ల 75 లక్షల రూపాయలతో చేపడుతున్న పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయన సూచించారు.