రాజంపేట మండలం వర్షాకాలంలో రైతులు సాగు చేసినా పంటల వివరాలను నమోదు చేసుకోవాలని రాజంపేట మండల వ్యవసాయ అధికారి శృతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోరారు. ఏ పంటలు సాగు చేశారో పూర్తి వివరాలు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు తెలియజేయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా సన్న వరి పంట సాగు చేసిన రైతులు పూర్తి వివరాలు తెలియచేయాలని చెప్పారు. సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని గుర్తు చేశారు.