రైతులు అధైర్య పడవద్దని క్లోరినేషన్ వాయువు వల్ల నష్ట పోయిన పలు పంటలకు ప్రభుత్వం తరుపున నష్ట పరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. సోమవారం కుకునూరు పల్లి మండలం మంగోలు గ్రామ శివారులోగల మిషన్ భగీరథ గ్రిడ్ ప్రాంతంలో అనుకోకుండా ప్రీ క్లోరినేషన్ విభాగం లో క్లోరిన్ వాయువు వెలువడడం మూలంగా పక్కన గల పలు పంటలపైన ఆ వాయువు పలు ఎకరాల్లో వ్యాప్తి చెంది వరి, పత్తి, ఇతర పంటలు ముడత రావడం జరిగిందని ఆయా పంటల రైతుల ఆవేదన మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ఎఫెక్ట్ అయిన పంటలను మిషన్ భగీరథ గ్రిడ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎఫెక్ట్ అయిన పంట