సరూర్ నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సరూర్ నగర్ చెరువును పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లు సక్రమంగా జరగకపోతే పోరాటం చేస్తానని కార్పొరేటర్ హెచ్చరించారు.