నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో శనివారం వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. టైర్లలో, కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నిల్వ ఉంచిన నీటిని వైద్య సిబ్బంది పారబోసారు. ఇవాళ వర్షాలకు గుంతల వద్ద నీరు నిల్వ ఉండడంతో వాటిలో దోమ లార్వా వృద్ధి చెందకుండా ఉండడానికి థీమో ఫాస్ స్ప్రే చేశారు. నీరు నిలువ ఉండడం వలన వ్యాధులు సోకుతాయని, నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం లో ఉండాలని తెలిపారు.