సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ కాసాల శివారులోని ఫెర్టిలైజర్ షాప్ కు యూరియా ఆదివారం రావడంతో రైతులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా ఫెర్టిలైజర్ షాప్ వద్ద ఆధార్ కార్డులను లైన్లో పెట్టి కార్డుకు రెండు యూరియా బస్తాలను ఇవ్వడం జరిగింది. యూరియా లోడ్ కాలి కావడంతో యూరియా దొరకని రైతులు నిరాశతో వేరుని దిరిగారు. యూరియా కొరతను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.