ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఎస్ డి మధుసూదన్ గురువారం ధర్మవరంలో పర్యటించారు.ముందుగా ధర్మవరం ఆర్డీవో మహేష్ ను కలిసి కొద్దిసేపు చర్చించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. 2019 నుండి 2021 వరకు ధర్మవరం ఆర్డీవో గా మధుసూదన్ ఉన్నారు.అప్పట్లో కరోనా సమయంలో ప్రజలకు అనేక సేవలు ఆయన అందించడం జరిగింది.