జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారము బడా భీంగల్ గ్రామంలో భారీ వర్షాలతో వరద తాకిడి మూలంగా వ్యవసాయ పొలాలలో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగిన భూములను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య మరియు ఉపాధి హామీ ఎపిఓ జి నరసయ్య ఇతర అధికారులతో కలిసి సందర్శించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఇసుక మీటలు వేసిన భూములలో ఉపాధి హామీ కూలీల ద్వారా తొలగిస్తామన్నారు.