జిల్లాలోని 22 మండలాలలో నిర్వహిస్తున్న ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం భాగంగా సుజాతనగర్ మండలంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి నాగలక్ష్మి సోమవారం సందర్శించారు. జిల్లా విద్యాధికారి శిక్షణలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా గ్రామాలలోని మహిళ నిరక్షరాస్యులను రాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఇది ఒక మంచి అవకాశం అని, అందరూ నిబద్ధతతో స్వచ్ఛందంగా పని చేయవలసి ఉందని, 100% అక్షరాస్యతా దిశగా కృషి చేయాల్సి ఉందని సూచించారు.