ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 31వ తారీఖు న జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు వినాయక నిర్వాహకుల పై బూటు కాళ్లతో తన్ని దౌర్జన్యం చేయడం అతి హేయమైన చర్యని సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఈరోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు నిరసన తెలుపుతూ దాదాపు రెండు వందల మంది హిందూ కార్యకర్తలు సోమప్ప సర్కిల్ నుండి డిఎస్పి ఆఫీస్ వెళ్లి డి.ఎస్.పి భార్గవి కి వినతిపత్రం అందజేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.