ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.మంగళవారం తలమడుగు మండలంలోని డోర్లీ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. సిబ్బంది యాప్ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న ప్రక్రియను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. సర్వేలో భాగంగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లను సేకరించి మొబైల్ యాప్ ద్వారా అడుగుతున్న అన్ని కాలమ్స్ కరెక్ట్ గా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.