తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో జరిగే ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆదివారం సిద్దిపేట పట్టణంలో పలువురు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగి కాసేపు ముచ్చటించారు. అనంతరం చింతమడక గ్రామంలో జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పలువురు జాగృతి నాయకులు పాల్గొన్నారు.