రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,వెంకట్రావు పల్లి గ్రామ శివారులో మంగళవారం 8:40 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటు చేసుకుంది,వెంకటాపూర్ కి చెందిన మహేష్ తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్లి తిరిగి వస్తుండగా,సిరిసిల్లకు చెందిన లక్ష్మణ్ తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వైపు వెళ్తుండగా,వెంకట్రావుపల్లి గ్రామ శివారు ప్రాంతం వద్దకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన డంతో,ఇరువురు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయా లు కాగా లక్ష్మణ్ కుడికాలు విరిగి మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి,స్థానికుల సహాయంతో ఇరువురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు,