యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పట్టణం, బొమ్మాయిపల్లి, హనుమాపురం గ్రామాలలో ఇండ్ల స్థలాల కోసం గతంలో జరిగిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ధ్రువపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.