పాలకవీడు మండలంలోని మహంకాళి గూడెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో ఇంటితో పాటు ఇంటి లోపల ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఆడావత్ చంద్రశేఖర్ కుటుంబం గురువారం రాత్రి ఇంటి బయట నిద్రిస్తుండగా, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రూ.1.50 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు.