పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నీరు కట్టు వేణు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. శనివారం పామూరు మండల టిడిపి అధ్యక్షులు బొల్లా నరసింహారావు సమక్షంలో వేణు టిడిపిలో చేరగా, టిడిపి కండువాను కప్పి వైసిపి సర్పంచ్ వేణును పార్టీలోకి నరసింహారావు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేణు మాట్లాడుతూ ... పామూరు మండలాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అభివృద్ధి చేస్తున్న తీరు నచ్చి , వైసీపీని వీడి టిడిపిలో చేరినట్లు తెలిపారు