సామర్లకోట మండల పరిషత్ కార్యాలయం నందు, మండల విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన, సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవం, నాడు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చేతుల మీదగా, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినటువంటి సామర్లకోట మండల ఉపాధ్యాయులకు, ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జడ్పిటిసి ఎలిశెట్టి అమృత నరేష్, బిజెపి నాయకులు విత్తనాల వెంకటరమణ, పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలను ఇతర గ్రామ టిడిపి నాయకులు. విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి అభినందించారు.