చీమకుర్తి రోడ్డుపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుండి చీమకుర్తి వైపుకు వస్తున్న ఓ కారు , ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో చీమకుర్తి రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ ను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడిన నేపథ్యంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.