ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సి కె పల్లి మండలం నామాలకు చెందిన రామాంజనేయులు (60) అనే వ్యక్తి సోమవారం తన ఇంటిలో ఊజీ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాధితునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.