ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ సంవత్సరం మట్టి వినాయక ప్రతిమల వినియోగం, పంపిణీ పెరిగింది అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. ఎంవిపి కాలనీ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా వినాయక చవితి విషయంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రతి సంవత్సరం వలె కాకుండా ఈ ఏడాది చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య నేతృత్వంలో చేసిన కృషి అభినందనీయం అన్నారు. అందువల్ల రాష్ట్రంలో బాగా ప్రచారం జరిగింది అన్నారు. ప్రతిమ కాకుండా ఇతరత్రా పూజా సామాగ్రి లోనికి వచ్చి చేరిన ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్, విషతుల్యమైన రసాయనాలు, భారీ లోహాలను వినియోగించకుండా ఆపాలన్నారు