ఎరువుల కొరత నివారించి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని, ఎరువులు బ్లాక్ మర్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర వ్యాపిత పిలుపుమేరకు ఎరువుల కొరత నిరసిస్తూ సోమవారం సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ డి.అశోక్ వర్మకు అందజేశారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ ప్రతీ ఎకరాకు 200 కిలోలు ఎరువులు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు ద్వారా సరఫరా చేయాలని కోరారు.