కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యర్థన మేరకు కామారెడ్డి పట్టణంలో గత వారం వచ్చిన వరదల సందర్భంగా భారత్ సేవాశ్రమ సంఘం పేదల కోసం ఒక్కో ఇంటికి అవసరమైన చీరలుంగి బిస్కెట్ ప్యాకెట్ చెదరి టీ షర్ట్స్ వంటివి 1200 కిట్లు దాదాపు 25 లక్షల కిట్లు ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం బాలవికాస అమెజాన్ వారు సంయుక్తంగా కామారెడ్డి పట్టణంలోని ఆర్ బి నగర్ కాలనీలో పేదల కోసం ఒక్కో ఇంటికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల కిట్లు 400 వరకు ఇచ్చినట్లు తెలిపారు అనంతరం పట్టణానికి చెందిన జైన్ సమాజ్ మార్వాడి సమాజ్ వారు సంయుక్తంగా పట్టణంలోని రుక్మిణి నగర్ కాలనీలో ఒక్కో ఇంటికి పంపిణీ చేశామన్నారు.