వినాయక ఉత్సవాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు వారి ముందస్తు అనుమతులు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు ఎవరికి ఎటువంటి చలానాలు చెల్లించనవసరం లేదని తెలిపారు. గణేశ్ ఉత్సవాలు నిర్వహించబోయే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం https: //ganeshutsav.net వెబ్సైట్ ఓపెన్ చేసి అనుమతులు పొందాలని కోరారు.