విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ వెల్ఫేర్ డే ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ వెల్ఫేర్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ బాక్సులు జిందాల్ తన ఛాంబర్ కు ఒక్కొక్కరిగా పిలిపించుకుని వారి వ్యక్తిగతమైన వృత్తిపరమైన శాఖపరమైన సమస్యలు తెలుసుకున్న అనంతరం వారి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు.