మట్టి గణనాథులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సన్ రైజర్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి తహసిల్దార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కరస్పాండెంట్ మారెన్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ విశ్రాంత ఉపాధ్యాయులు నాగరాజు పర్వతన్న లతో కలిసి వినాయక ప్రతిమలతో పాటు మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. పండుగలు సాంప్రదాయాలు పర్యావరణ పరిరక్షణ మొక్కల ప్రాముఖ్యత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల కారణంగా జలచరాసులకు తీవ్ర నష్టం అంశాలపై తహసిల్దార్ ప్రజలకు అవగాహన కల్పించారు.