గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బకింగ్ హమ్ కెనాల్లో గుర్తు తెలియని రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. స్థానికులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిపాలెం గత వారం రోజులకు పైగా కాలువలోని కంప చెట్లలో ఈ మృతదేహాలు ఉన్నాయని, అయితే స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉండటంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పోలీసులకు సమాచారం అందించినా స్పందన లేదని, దయచేసి మృతదేహాలను తొలగించాలని కాలనీవాసులు కోరారు.