అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మోదీనాబాద్ కు చెందిన ఉమాదేవి, కుమార్తె తనుశ్రీ, కుమారుడు ఆదిత్య ముగ్గురు అదృశ్యమయ్యారు. వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మోదీనాబాద్ కు చెందిన ఉమాదేవి భర్త చిన్న రంగస్వామితో ఈ నెల 8న గొడవ పడి ఇద్దరు పిల్లలతో ఎటో వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న ఉమాదేవి తల్లి వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ మనోహర్ కోరారు.