ఈ నెల 5, 6వ తేదీల్లో జరిగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారికి ఆయన సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.