మునగాల మండలం తాడ్వాయి సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం ఉదయం నుంచే క్యూలైన్లో నిలబడిన రైతులు, ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, సకాలంలో సరఫరా చేసి తమను ఆదుకోవాలని వారు కోరారు.