రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17వ తేదీన విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని గురువారం జిల్లా కేంద్రంలో ఉన్న క్రాంతి భవన్ వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.