జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ సమస్యలను పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్టు సంఘం అధ్యక్షులు బండారి గంగాధర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించలేదని సీఎం రేవంత్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ జీవో విడుదల చేయడాన్ని తామంతా హర్షిస్తున్నట్లు తెలిపారు.