పలమనేరు: ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహరతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో కలిసి పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరిన కృష్ణా జాలాలు. శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కుప్పానికి చేరుకున్న కృష్ణమ్మ. పంచెకట్టుకుని సంప్రదాయ పద్దతిలో కృష్ణమ్మకు జలహరతి ఇచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పంచి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గం టిడిపి నేతలు సైతం పాల్గొన్నారు.