బోగోలు మండలం కోవూరుపల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 60 ఏళ్లు ఉంటుంది. మృతదేహాన్ని 108 వాహనంలో కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పై ఫోటోలోని వ్యక్తి వివరాలు తెలిస్తే బిట్రగుంట స్టేషనన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది.