నడుస్తున్న రైలు ఎక్కబోయి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే పోలీసుల వివరాలు.. ప్లాట్ఫామ్ నంబర్ 2లో గుర్తు తెలియని వ్యక్తి MMTS రైలు ఎక్కబోయి కాలు జారి రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల, మొండెం, చేయి మూడు భాగాలు విడివిడిగా పడ్డాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.