అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దిగువ కుమడా ఘాటీలో శనివారం సాయంత్రం జీపు బోల్తాపడి ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముంచంగిపుట్టు సామాజిక ఆసుపత్రికి తరలించారు. ముంచంగిపుట్టు మండలం కుముడా పంచాయతీ దిగువ కుమడా సరిహద్దుల్లో ఘాటీ మలుపులు వద్ద ప్రయాణీకులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరు ముంచంగిపుట్టు వారపుసంతకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులను ముంచంగిపుట్టు సామాజిక ఆసుపత్రికి తరలించారు.